Venkatesh1

Mar 26 2024, 07:09

సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నాం.. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్న ప్రజలు..శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నాం.. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్న ప్రజలు.. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగనన్నదే విజయం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజలు ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్నను గెలిపించుకుంటామన్నారని ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ అన్నారు. 

శింగనమల మండలం లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, నాగులగుడ్డం, నాగులగుడ్డం తండా గ్రామాల్లో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, ఆలూరు సాంబ శివారెడ్డితో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ, చేపట్టారు. 

ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలలతో సన్మానించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను, అవ్వ తాతలను పలకరిస్తూ వైఎస్సార్సీపీ చేసిన మేలును వివరించారు. వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, రాబోయే ఎన్నికలలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగనన్నదే విజయమన్నారు. టిడిపి, జనసేన, బిజెపితో పాటు ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నినా జగనన్నని తాకలేరన్నారు. గత టిడిపి పాలనలో పాలకులు దోచుకోవడానికి మాత్రమే పరిపాలించారన్నారు. వైఎస్ఆర్సిపి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరిస్తుందన్నారు. వెళ్లిన ప్రతి గ్రామంలో సంక్షేమం కనిపిస్తోందని, టిడిపి ఎన్ని కూటములతో వచ్చినా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు వారి మాటను తెలియజేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎంత మందితో వచ్చినా జగనన్న సింగల్ గా అఖండ మెజారిటీతో మళ్లీ తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పల్లెనిద్ర ద్వారా గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ వారితో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని ఆ గ్రామాల్లో బస చేయడం వల్ల ప్రజలకు మరింత దగ్గర అవడం ఎంతో సంతోషం ఇస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 25 2024, 07:47

28న బీకేఎస్ లో చంద్రబాబు పర్యటనకు సభవేదిక ఖరారు..

28న బీకేఎస్ లో చంద్రబాబు పర్యటనకు సభవేదిక ఖరారు..

 స్థలం పరిశీలించిన ప్రజాగళం రాష్ట్ర కోఆర్డినేటర్ రాజశేఖర్ , టూమెన్ కమిటీ సభ్యులు ఆలం, కేశవరెడ్డి పలువురు టీడీపీ నేతలు 

( శింగనమల నియోజక వర్గం) 

 శింగనమల నియోజకవర్గంలో ఈ నెల 28న ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు పర్యటన బుక్కరాయసముద్రంలో ఖరారు అయి ంది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రజాగళం రాష్ట్ర కోఆర్డినేటర్ రాజశేఖర్ బాబు ద్విసభ్యకమిటీ సభ్యులు అలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షుడు పసుపుల హనుమం తురెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు,కన్వీనర్ అశోక్ లు సభావేదిక స్థలంను పరిశీలించడం జరిగింది. బుక్కరాయసముద్రం పరిధిలోని తాడిపత్రి రోడ్డులో 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే వేదిక ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 28న రాప్తాడు. నియోజకవరం పర్యటన అనంతరం మద్యాహ్నం 3గంటలకు బుక్కరాయసముద్రంలో సమావేశం ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు.

Venkatesh1

Mar 25 2024, 07:40

ముమ్మాటికీ.. జగన్ సర్కారే హత్యలు.. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యలు బాధాకరం..

ముమ్మాటికీ.. జగన్ సర్కారే హత్యలు.. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యలు బాధాకరం.. 

బీసీలంతా సీఎం జగన్ ని వ్యతిరేకించాలి.. (శింగనమల నియోజకవర్గం )

వైసిపి దాష్టీ కానికి ఓ చేనేత కుటుంబం బలైంది. కడప జిల్లాలో ఒంటిమిట్ట గ్రామంలో జరిగిన ఘటనకు ఘటన ఇది ఆత్మహత్యలు కాదు... ముమ్మాటికీ జగన్ సర్కారే చేసిన హత్యనేనని సింగనమల నియోజకవర్గం టిడిపి నేతలు ఆరోపించారు.

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట కొత్త మాధవరంలో రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై సింగనమల నియోజకవర్గం టూ మెన్ కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమడు కేశవరెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యనిర్వ కార్యదర్శి రామలింగారెడ్డి జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు పసుపుల హనుమంతురెడ్డి ,జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు , కన్వీనర్ అశోక్ స్పందించారు. ఆదివారం బుక్కరాయసముద్రం పెద్దమ్మ గుడి సర్కిల్ వద్ద కొవ్వొత్తులు తో ర్యాలీ చేసి వారి కుటుంబానికి శ్రద్ధాంజలి ప్రకటించి అనంతరం మాట్లాడారు .ప్రభుత్వ దాష్టీకానికి ఓ చేనేత కుటుంబం బలైపోయిందని ఆరోపించారు. వైసీపీ నేతల కబ్జాకాండ నిండు కుటుంబం ఉసురు తీసిందని టీడిపి నేతలు ఆరోపించారు. కబ్జారాయుళ్లతో పోరాడలేక బీసీ కుటుంబం ప్రాణాలు తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాటలకందని విషాదం ప్రతి ఒక్కరినీ ఆందోళనలో పడేస్తోందని తెలిపారు. కొత్త మాధవరంలో జరిగిన ఈ ఘటనకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు? ఎంత ఆవేదన చెందితే ఇలా ప్రాణాలు తీసుకుంటారో తెలుసా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై స్పందించి ఆత్మహత్య కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగనమల నియోజకవర్గం టిడిపి నేతలు డిమాండ్ చేశారు.

 వైసీపీ నేతల భూ కబ్జాలకు కుటుంబం బలి నియోజవర్గం టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ 

వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కొత్త మాధవరంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం పట్ల టీడీపీ సింగనమల నియోజకవర్గం అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాల సుబ్బారావు, భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వారి భూమిని కబ్జా చేయడంతోనే ఆ చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ జగన్ సర్కారు చేసిన హత్యేనని ధ్వజమెత్తారు. ఈ మేరకు పాల సుబ్బారావు కుటుంబానికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బండారు శ్రావణి శ్రీ డిమాండ్ చేశారు. బీసీలపై జగన్ అండతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ మూకలను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని నియోజవర్గం టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ డిమాండ్ చేశారు

Venkatesh1

Mar 25 2024, 07:33

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు "పల్లె నిద్ర".. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు "పల్లె నిద్ర".. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకే గడపగడపకు ఎన్నికల ప్రచారం తర్వాత రెండవ రోజు "పల్లెనిద్ర" కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎం. వీరాంజనేయులు తెలిపారు.

గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామంలో పార్టీ నాయకులు, ప్రజలతో కలసి  స్థానిక సమస్యలను పట్ల సమావేశం నిర్వహించి, బిసి కాలనీలో బస చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని వారికి వివరించారు. రానున్న ఎన్నికలలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను చేసుకుంటే మనకి ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశాలపై వారితో చర్చించారు. 

స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని ప్రభుత్వం వచ్చాక పరిష్కరించడానికి కృషి చేస్తానని వారికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 25 2024, 07:26

చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం...శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు

చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం...శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన సంక్షేమాభివృద్ధి పాలనకు ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని నియోజకవర్గ అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు.

"మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గార్లదిన్నె మండలం పెనకచెర్లడ్యాం, పెనకచెర్ల, పి.కొత్తపల్లి, కేశవాపురం, కొప్పలకొండ గ్రామాలలో రెండవ రోజు స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వైయస్సార్సీపీ ఎన్నికల ప్రచారాన్ని అయన చేపట్టారు.

పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి అందరినీ పలకరిస్తూ, ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. గడప దగ్గరకు సంక్షేమ పాలన అందాలి అంటే ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని తెలిపారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలను అందించి అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం సమిష్టిగా కృషి చేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సైనికుల్లా పనిచేద్దామన్నారు. అన్ని వర్గాలకు మీరు చేసిన జగనన్నను రాబోయే ఎన్నికలలో మళ్ళీ గెలిపించాలని కోరారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమీలేదన్నారు. టీడీపీ ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదనే విషయాన్ని గుర్తు చేశారు. కుల, మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీ కే దక్కుతుందన్నారు.

ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చి ప్రజల గుండెల్లో నమ్మకాన్ని పొందారన్నారు. పొత్తులతో వస్తున్న టిడిపిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని చెబుతున్నారన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నెరవేర్చారన్నారు. జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి గ్రామాల్లో ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మీ అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. 

ఎన్నికల ప్రచారం అనంతరం గ్రామాల్లోని ఎస్సీ కాలనీలలో "పల్లెనిద్ర" అనే ఒక వినూత్నమైన కార్యక్రమంతో నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Mar 24 2024, 08:38

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ""కార్యక్రమం నిర్వహించిన జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు..

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని  K.V.S నగర్ దక్షిణ మూర్తి నగర్ ఐలమ్మ కాలనీ గిరిప్రసాద్ నగర్ వీరభద్ర కాలనీ ""బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ""కార్యక్రమం నిర్వహించిన జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, అశోక్ లక్ష్మి నారాయణ SK,వేంకటేశు S.నారాయణ స్వామి కేశన్న సందర్భంగా మాట్లాడుతూ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు.మహిళల కోసం మంచి పథకాలు పొందుపరిచారన్నారు.ఇందులో భాగంగా ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18 వేల రూపాయలు, తల్లికి వందనం పథకం కింద పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి ఒక్కొక్కరికి 15000 చొప్పున ఎంతమందిని బడికి పంపిస్తే అంతమందికి వర్తింపజేసేలా,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు,ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి ఇచ్చి వారిని పూర్ టు రిచ్ అయ్యేలా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఎసిసి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అలాగే శింగనమల అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి బండారు"" శ్రావణి శ్రీ ""గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నల్లాని నాగభూషణ మల్లికార్జున రెడ్డి రామానాయుడు వేంకట సబ్బయ్య నరేంద్ర యాదవ్ ఓబులపతి తలారి రంగయ్య జొన్నరామయ్య పెద్దప్ప బోలే అక్కలప్ప మదు ఎల్లప్ప వడ్డే రామకృష్ణ బాబయ్య చితంబరి హరి భూషి చెరకూరి అడవాల రవి శేషు కాటమయ్య రాజు యుగంధర్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

Venkatesh1

Mar 24 2024, 08:31

టిడిపి అభ్యర్థుల సమావేశంలో.. సింగనమల నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ..

టిడిపి అభ్యర్థుల సమావేశంలో.. సింగనమల నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ..

విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థులకు శనివారం నిర్వహించిన టిడిపి వర్క్ షాప్ కు సింగనమల నియోజవర్గ టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు పసుపుల హనుమంత రెడ్డి, బండారు శ్రావణి శ్రీ సోదరి బండారు కిన్నెర శ్రీ లు హాజరయ్యారు. ఈ సమావేశం టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, ఎన్నికల సరళి, ఎన్నికల పోల్ మేనేజ్మెంట్, పార్టీ సమన్వయం, వైసిపి చేపడుతున్న అవినీతి అక్రమాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లి.... ప్రజలు టిడిపి వైపు ఆకర్షణగా ఎలా మలుచుకోవాలి, పార్టీ బలోపేతం తదితరు అంశాలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిశా, నిర్దేశం ఈ వర్క్ షాప్ లో చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ కు జిల్లా నుంచి టిడిపి అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, రాప్తాడు అభ్యర్థి పరిటాల సునీత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, కళ్యాణ దుర్గం టిడిపి అభ్యర్థి అమిలి నేని సురేంద్ర, మడకశిర అభ్యర్థి సునీల్, తదితరు టిడిపి నేతలు హాజరు కావడం జరిగింది.

Venkatesh1

Mar 24 2024, 08:22

ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ని అత్యధిక మెజార్టీ తో గెలిపించండి.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆలం నరసానాయుడు..

ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ని అత్యధిక మెజార్టీ తో గెలిపించండి.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆలం నరసానాయుడు..

శిగనమ నియోజకవర్గం నార్పల మండలం బి పప్పూరు పంచాయితీ బొమ్మకుంటపల్లి గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు. గ్రామం లోకి రాగానే గ్రామస్తులు,sc కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు, ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని జగన్ సిద్ధం సభలన్నీ అబద్ధపు సభలు అని, మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిన పొదుపు సంఘాల డబ్బులు కూడా సొంత పార్టీ ప్రయోజనాలకోసం జగన్ వినియోగించు కున్నారని, పేద కుటుంబాలు పండుగ చేసుకునేందుకు గత ప్రభుత్వంలో కానుకలు ఇచ్చేదని వాటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, అభివృద్ధి అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నపుడే అని కావున వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ తో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్లీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుందామని మన ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని తద్వారా నిరుద్యోగ సమస్య ఉండదని ఆలం నరసానాయుడు గారు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,మాజీ ఎంపీటీసీ లు,క్లస్టర్,యూనిట్, బూత్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 24 2024, 08:15

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం.. పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని గెలిపిద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం.. పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని గెలిపిద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

◆ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ.

పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని రానున్న ఎన్నికలలో మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని వీరాంజనేయులు, ఎం.శంకర్ నారాయణ అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి గ్రామంలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా, పార్టీ జెండా ఊపి ఎన్నికల ప్రచారాన్ని నాయకులు, కార్యకర్తల మధ్య ఎం. శంకర్ నారాయణ, ఎం. వీరాంజనేయులు, పైలా నరసింహయ్య ప్రారంభించారు.

ముందుగా గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నీలాంపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి పాత చెదళ్ల, కొత్త చెదళ్ల, రోటరీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఇంటింటికీ తిరిగి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేయడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించుకుందామన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే శింగనమల నియోజకవర్గాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ కరపత్రం అందజేస్తూ ఓటు అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ఇబ్బందులను కళ్లారా చూసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదల అభ్యున్నతి కోసం నవరత్నాల పథకాలు అమలు చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. గత టిడిపి పాలనలో ప్రజలకు ఫలానా చేసాము అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో జగనన్న మీద తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విదంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అభివృద్ధి చేసి చూపించారన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలోని ప్రజలను పట్టించుకున్న పాపాన పోని టీడీపీ నాయకులు కూడ అభివృద్ధి గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న పథకాల కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

శంకర్ నారాయణ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులకు అవకాశం కల్పించిన వైస్సార్సీపీ పార్టీ పేదల పార్టీగా జగనన్న నిరూపించారన్నారు. చంద్రబాబు నాయుడు డబ్బు ఉన్నవారికి మాత్రమే టికెట్లు కేటాయించారన్నారు. గత టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదన్నారు. ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు పొత్తులతో వస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్తుంటే సంక్షేమ పథకాలు అందడంతో తమ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. గొప్ప పాలన ఇలాగే కొనసాగాలి అంటే మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, నియోజకవర్గ పరిశీలకులు రమేష్ రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ మాల్యవంతం మంజుల, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధం సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 24 2024, 08:07

పల్లె నిద్ర చేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజి నేయులు..

పల్లె నిద్ర చేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజి నేయులు..

పల్లె నిద్రలో కార్యక్రమంలో స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.

బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం తర్వాత "పల్లె నిద్ర" కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీలో బస చేయటం జరిగింది. గ్రామ సమస్యలపై ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. వాటి పరిస్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమస్యలను గుర్తించి తాము కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.